- Advertisement -
ఐసీసీ విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో చరిత్ర సృష్టించాడు టీమిండియా ఆటగాడు రోహిత్ శర్మ. ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాకింగ్స్లో రెండు స్థానాలు ఎగబాకి అగ్రస్థానం సొంతం చేసుకున్నారు రోహిత్.
ప్రస్తుతం 781 రేటింగ్ పాయింట్స్‌తో అగ్రస్థానంలో ఉన్నాడు రోహిత్ శర్మ. ఈ క్రమంలో వన్డేల్లో నెంబర్ వన్ ర్యాంకు దక్కించుకున్న అతి పెద్ద వయస్కుడిగా రికార్డుల్లోకెక్కాడు రోహిత్.
అంతేగాదు రోహిత్ కెరీర్లో వన్డేల్లో అగ్రస్థానం సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం.

