ఐపీఎల్ 2026 వేలానికి నమోదు అయిన ఆటగాళ్ల జాబితా విడుదలైనప్పుడు, కామెరూన్ గ్రీన్ ను ఏ కేటగిరీలో చేర్చారన్నదే పెద్ద ఆశ్చర్యంగా మారింది. ఆల్‌రౌండర్ అయిన గ్రీన్‌ను బ్యాటర్‌గా నమోదు చేయడం గమనార్హం. స్పెషలిస్ట్ బ్యాటర్లు ముందుగా వేలంలోకి వస్తారు కాబట్టి, జట్ల వద్ద ఉన్న పర్స్‌ను బాగా ఉపయోగించుకునేలా ఉద్దేశపూర్వకంగా అలా చేశారన్న వార్తలు వచ్చాయి. మరికొన్ని నివేదికలు అయితే బౌలర్‌గా అతని ఫిట్‌నెస్‌పై సందేహాలున్నాయని పేర్కొన్నాయి.
అయితే, గరిష్టంగా రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌తో వేలంలోకి వచ్చే గ్రీన్—ఈ వేలంలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా మారే అవకాశమున్నాడని అంచనా—తనను బ్యాటర్‌గా నమోదు చేయడం ఉద్దేశపూర్వకంగా కాదని, అది తన మేనేజర్ చేసిన పరిపాలనా తప్పిదమేనని స్పష్టం చేశాడు.
ఇది వింటే నా మేనేజర్‌కు నచ్చకపోవచ్చు, కానీ ఇది అతని వైపు నుంచి జరిగిన చిన్న గందరగోళమే అని గ్రీన్ వివరించాడు. అతను ఉద్దేశపూర్వకంగా బ్యాటర్ అని పెట్టలేదు. తప్పుగా వేరే బాక్స్ సెలెక్ట్ చేశాడు అనుకుంటా. అందుకే ఇది ఇలా పెద్ద చర్చగా మారింది. నిజానికి ఇది ఒక సింపుల్ తప్పిదమే. నేను బౌలింగ్ చేయడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాను అని వెల్లడించారు.
యాషెస్ సిరీస్‌పై దృష్టి పెట్టిన గ్రీన్, తొలి రెండు టెస్టుల్లో కేవలం 16 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన తాను, మిగిలిన టెస్టుల్లో మరింత ఎక్కువ ఓవర్లు వేయనున్నానని ఆశాభావం వ్యక్తం చేశాడు. సిరీస్ ప్రారంభ దశలో కొంత ఓవర్లు ఆదా చేసుకోవడం తర్వాతి మ్యాచ్‌లకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే సిరీస్ చివరి దశలో అందరూ అలసిపోయినప్పుడు నాపై ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఇప్పటివరకు ఉన్నంతవరకు ఓవర్లు ఉండటంపై నేను సంతోషంగానే ఉన్నాను. కానీ వచ్చే కొన్ని మ్యాచ్‌లలో అవి ఖచ్చితంగా పెరుగుతాయని నాకు నమ్మకం ఉంది అని గ్రీన్ తెలిపారు.
