- Advertisement -

సోనియా, రాహుల్‌కు బిగ్ రిలీఫ్

- Advertisement -

నేషనల్ హెరాల్డ్ కేసులో సీనియర్ కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు భారీ ఊరట లభించింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మంగళవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దాఖలు చేసిన ఫిర్యాదును స్వీకరించేందుకు (కాగ్నిజెన్స్ తీసుకోవడానికి) నిరాకరించింది. ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే, మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఈడీ దాఖలు చేసిన ఫిర్యాదు “నిర్వహించదగినది కాదు” అని స్పష్టం చేశారు.

“ఫిర్యాదు కొట్టివేయబడింది” అని న్యాయమూర్తి పేర్కొన్నారు. అయితే, ఢిల్లీ పోలీసులు తాజాగా ఒక ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినందున, ఈ కేసులో మరిన్ని వాదనలు వినే అవకాశం ఉందని చెప్పారు. అలాగే, ఈడీ తన దర్యాప్తును కొనసాగించవచ్చని కోర్టు స్పష్టం చేసింది.

ఈడీ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సుమన్ దూబే, సామ్ పిట్రోడా, యంగ్ ఇండియన్, డోటెక్స్ మెర్చండైజ్, సునీల్ భండారిలను ప్రధాన నిందితులుగా పేర్కొంది. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL)కు చెందిన ₹2,000 కోట్లకు పైగా విలువైన ఆస్తులు అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని ఈడీ ఆరోపించింది.

ఈడీ విచారణను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శిస్తూ, దీన్ని రాజకీయ కక్షసాధింపుగా అభివర్ణించింది. అయితే, ఈడీ మాత్రం ఇది మోసం, మనీలాండరింగ్‌కు సంబంధించిన తీవ్రమైన ఆర్థిక నేరం అని వాదించింది. ఢిల్లీ కోర్టు ఈడీ చార్జ్‌షీట్‌ను కొట్టివేయడాన్ని కాంగ్రెస్ స్వాగతించింది. పార్టీ ఎంపీ అభిషేక్ మను సింఘ్వి మాట్లాడుతూ, ఈ కేసులో “డబ్బు కదలిక ఒక్క మిల్లీమీటరు కూడా లేదు” అన్నారు. బీజేపీపై విమర్శలు గుప్పిస్తూ, ఇది అతిశయోక్తులతో నిర్మించిన కథనం అని చెప్పారు. ఏ ఆస్తి బదిలీ కాలేదు, అన్ని ఆస్తులు AJL వద్దే ఉన్నాయి. 90 శాతం యాజమాన్యం యంగ్ ఇండియన్‌కు వెళ్లిందన్నదే జరిగింది అని ఆయన వివరించారు.

కాంగ్రెస్ ఎంపీ కే.సి. వేణుగోపాల్ కూడా బీజేపీని విమర్శిస్తూ, ఈ తీర్పు కాంగ్రెస్ స్థావరాన్ని న్యాయస్థానం సమర్థించిందని అన్నారు. ఇది కేవలం సోనియా, రాహుల్ గాంధీలకు మాత్రమే కాదు; మోదీ ప్రభుత్వ రాజకీయ వేధింపులను కోర్టు బయటపెట్టింది అని వ్యాఖ్యానించారు.ఈడీ ఫిర్యాదు ఆధారంగా, గత నెల ఢిల్లీ పోలీసులు కూడా సోనియా, రాహుల్ గాంధీలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అలాగే, కేసుకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఉండవచ్చని పేర్కొంటూ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు సమన్లు జారీ చేశారు.

అయితే, శివకుమార్ ఈ సమన్లను వేధింపులుగా పేర్కొంటూ, న్యాయపరంగా పోరాడతానని తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ, సమన్లతో పాటు ఎఫ్‌ఐఆర్ ప్రతిని ఇవ్వలేదని, అందుకే ముందుగా ఎఫ్‌ఐఆర్ కాపీ కోరతానని, అసెంబ్లీ సమావేశాల అనంతరం వచ్చే వారం హాజరవుతానని చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -