దర్శకధీరుడు రాజమౌళి – సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం వారణాసి. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను 2027 ఏప్రిల్ 9న థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. శ్రీరామ నవమి స్పెషల్గా ఈ చిత్రాన్ని విడుదల చేయాలన్న యోచనలో చిత్రబృందం ఉంది. దీనిపై అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశముంది.
మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్లతో పాటు ఈ సినిమాలో మరికొందరు ప్రముఖ నటులు కూడా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ను కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్నారు. దాదాపు రూ.1300 కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమా రూపొందుతున్నట్లు సమాచారం.ఈ చిత్రానికి సంగీతం ఎమ్ఎమ్ కీరవాణి అందిస్తుండగా, కథా కథనాన్ని విజయేంద్ర ప్రసాద్ రాశారు.
