- Advertisement -

ఆరోగ్య ప్రదాయని మునగాకు!

- Advertisement -

మునగ చెట్టులో వేర్లు, ఆకులు, పూలు, కాయలు అన్నీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఆయుర్వేదం ప్రకారం మునగ అనేక వ్యాధులకు ఉపశమనాన్ని ఇస్తుంది. ముఖ్యంగా మునగాకులు, మునగకాయలు ఎక్కువగా వినియోగిస్తారు. డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధులు సహా అనేక సమస్యలకు మునగాకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఇవి రోజువారి ఆహారంలో ఉండాల్సిందే.

మునగాకు ఒక పోషకాల గని అని చెబుతారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. 100 గ్రాముల మునగాకుల్లో నారింజ కంటే 7 రెట్లు ఎక్కువ విటమిన్ C ఉంటుంది. పాల కంటే 17 రెట్లు ఎక్కువ కాల్షియం, అరటిపండ్ల కంటే 15 రెట్లు ఎక్కువ పొటాషియం, పెరుగుతో పోలిస్తే 9 రెట్లు ఎక్కువ ప్రోటీన్, స్పినాచ్ కంటే 25 రెట్లు ఎక్కువ ఐరన్ ఉంటుంది. అదనంగా విటమిన్ A, మాగ్నీషియం, మాంగనీస్, విటమిన్ K, విటమిన్ E కూడా ఉన్నాయి. మునగాకులు ఫైబర్ ఎక్కువగా, కాలరీలు చాలా తక్కువగా ఉంటాయి.

()మునగ వేర్లను నీటిలో మరిగించి తాగితే టైఫాయిడ్‌లో ఉపశమనం కలుగుతుంది.

()మునగాకుల పేస్ట్ తలనొప్పి తగ్గించడానికి సహాయపడుతంది.

()గొంతు నొప్పి ఉంటే మునగ వేర్ల కషాయం తో పుక్కిలిస్తే ఉపశమనం లభిస్తుంది.

()మునగాకులు నమలడం ద్వారా షుగర్ నియంత్రణకు సహాయపడుతుంది.

()అధిక కొలెస్ట్రాల్ తగ్గించడంలో మునగాకులు ఉపయోగకరం.

()శారీరక బలహీనత తగ్గేందుకు మునగ పూలను నీటిలో మరిగించి తాగవచ్చు.

()ఆర్థరైటిస్ నొప్పులను తగ్గించడంలో మునగాకులు ప్రభావవంతం.

()కాలేయ ఆరోగ్యాన్ని కాపాడి, శరీరాన్ని డీటాక్స్ చేయడంలో మునగ సహాయపడుతుంది.

అధిక ప్రయోజనం కోసం ఉదయం ఖాళీ కడుపుతో మునగాకులు తినడం మంచిదని భావిస్తారు. ఉదయం లేదా అల్పాహారానికి ముందు తినవచ్చు. రాత్రి వేళ మునగాకులు తినకపోవడం మంచిది.రోజుకు సుమారు 5–7 గ్రాములు తాజా మునగాకులు తినవచ్చు. లేకపోతే 1–2 టీస్పూన్లు మునగాకు పొడి తీసుకోవచ్చు. గర్భిణీలు లేదా ఇప్పటికే ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుడి సలహాతో మాత్రమే తీసుకోవాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -