- Advertisement -

నా సినిమా ఫ్లాప్ అయినా డబ్బు సంపాదిస్తా!

- Advertisement -

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో ఘనంగా జరిగిన సంక్రాంతి మహోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాయకుడి నిజమైన లక్షణం నాయకుడు అవసరం లేని సమాజాన్ని నిర్మించడం అని చెప్పారు. “నేను ఎక్కడ ఉన్నా లేకున్నా పిఠాపురం అభివృద్ధి పనులు కొనసాగాలి. ఏ పని కావాలన్నా ఎమ్మెల్యేనే రావాలి అనే విధానం వల్ల సమస్యలు వస్తాయి. పిఠాపురం అభివృద్ధికి గతేడాది రూ.308 కోట్లు ఖర్చు చేశాను అని తెలిపారు.

అలాగే పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, నేను నెంబర్ వన్ యాక్టర్ కావచ్చు కాదని, కానీ నా సినిమాలు ఫ్లాప్ అయినా డబ్బు సంపాదించగలిగే సామర్థ్యం నాకు ఉంది. అలాంటి సామర్థ్యాన్ని పౌర సేవలో వినియోగించడం నాయకుడి పనితనం అని తెలిపారు.

వేడుకల్లో రాష్ట్రవ్యాప్తంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, హస్తకళలు, చేనేత కళల స్టాల్స్ ఏర్పాటు చేయడం ద్వారా స్థానిక సంస్కృతి, గొప్పతనం ప్రతిబింబించబడిందని డిప్యూటీ సీఎం గుర్తుచేశారు.

అంతేకాదు, పవన్ కళ్యాణ్ పిఠాపురం ప్రజలకు, “నేను ఎక్కడా ఉన్నా నా గుండెల్లో పిఠాపురం ఉంటుంది. పని చేసే నాయకులను గుర్తించాల్సిన బాధ్యతను నాయకత్వం తీసుకోవాలి. ఎన్నికలు అయిపోయాయి అని వదిలేస్తే, అభివృద్ధి పనులు ఎలా ముందుకు వెళ్ళతాయి?” అని తెలియజేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -