స్టార్ హీరోయిన్ సమంత నటిస్తున్న చిత్రం మా ఇంటి బంగారం. ఈ చిత్రాన్ని సమంతే స్వయంగా త్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ కింద ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఈ సినిమాకు రచయిత రాజ్ నిడిమోరు. సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా టీజర్‌ను రిలీజ్ చేశారు నిర్మాతలు.
ఇందులో ఓ అమాయకమైన కోడలిగా ఉమ్మడి కుటుంబంలో అడుగుపెట్టిన మహిళను పరిచయం చేశారు. పైకి చూస్తే సాధారణంగా, నిర్దోషిగా కనిపించినా, ఆమె వెనుక ఓ పెద్ద రహస్యం దాగి ఉన్నట్లు టీజర్ సూచిస్తోంది. అసలు ఆమె ప్రతీకార లక్ష్యంతోనే గ్రామానికి వచ్చినట్టు తెలుస్తోంది. కథ ముందుకు సాగేకొద్దీ, ఆ కొత్త కోడలు నిజంగా ఎవరు? ఆమె అసలు ఉద్దేశ్యం ఏమిటి? అన్నది కుటుంబ సభ్యులు కూడా పూర్తిగా అర్థం చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది.
సినిమా కథపై ఆసక్తిని పెంచేలా టీజర్‌ను కట్ చేశారు. స్టైలిష్ యాక్షన్ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. గూండాలను చితకబాదే సన్నివేశాల్లో సమంత పవర్‌ఫుల్ యాక్షన్‌తో అదరగొట్టింది. టీజర్ మొత్తం కొత్తగా, ఆకట్టుకునేలా అనిపిస్తుంది. ఈ చిత్రానికి సంగీతం సంతోష్ నారాయణన్ అందిస్తున్నారు.
