- Advertisement -

తెలంగాణ డీజీపీ శివధర్ నియామకానికి లైన్ క్లియర్

- Advertisement -

తెలంగాణ రాష్ట్ర డీజీపీగా శివధర్ రెడ్డి నియామకానికి లైన్ క్లియర్ అయింది. ఈ నియామకంపై దాఖలైన పిటిషన్‌ను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. డీజీపీ నియామక ఉత్తర్వులపై స్టే ఇవ్వడానికి అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. దీంతో శివధర్ రెడ్డి ఇంచార్జ్ డీజీపీగా కొనసాగడంపై ఉన్న అనిశ్చితికి ముగింపు పడింది.

శివధర్ రెడ్డి నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు ఇప్పటికే కొట్టివేయగా, అదే తీర్పుతో సీజేఐ ధర్మాసనం ఏకీభవించింది. ఈ సందర్భంగా కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పూర్తిస్థాయి డీజీపీ నియామక ప్రక్రియను నాలుగు వారాల్లోగా పూర్తి చేయాలని యూపీఎస్సీకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం పంపిన అర్హుల జాబితాను యూపీఎస్సీ పరిశీలించాలని సూచించింది.

ఇంచార్జ్ డీజీపీ నియామకాన్ని తప్పుబట్టలేమని, నిబంధనల ప్రకారమే ప్రక్రియ కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పూర్తి స్థాయి డీజీపీ నియామకం జరిగే వరకు ఇంచార్జ్ డీజీపీగా శివధర్ రెడ్డి బాధ్యతలు నిర్వహించడంలో ఎలాంటి అడ్డంకి లేదని పేర్కొంది. ఈ తీర్పుతో రాష్ట్ర పోలీస్ శాఖలో స్థిరత్వం ఏర్పడుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -