మరో రెండు రోజుల్లో ఫిబ్రవరి 7 నుండి టీ20 వరల్డ్ కప్ ప్రారంభంకానుంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ ప్రతిష్టాత్మక టోర్నీ ఇది 10వ ఎడిషన్. 20 జట్లు పాల్గొంటున్న ఈ మెగా ఈవెంట్‌పై క్రికెట్ అభిమానుల చూపంతా ఉంది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనున్న టీమిండియా మరోసారి చరిత్ర సృష్టించాలనే లక్ష్యంతో ఉంది. ఈసారి గెలిస్తే వరుసగా టైటిల్ నిలుపుకున్న తొలి జట్టుగా, అత్యధిక టీ20 వరల్డ్‌కప్‌లను గెలిచిన జట్టుగా భారత్ నిలవనుంది.
ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్‌కప్‌ల్లో భారత్ ప్రదర్శన ఎలా ఉందో చూద్దాం. 2007లో తొలి టీ20 వరల్డ్‌కప్ జరిగింది. ఎంఎస్ ధోనీ నాయకత్వంలో యువ జట్టుతో బరిలోకి దిగిన భారత్, ఫైనల్లో పాకిస్థాన్‌ను ఓడించి తొలి టైటిల్ సాధించింది. ఆ తర్వాత 2009లో డిఫెండింగ్ చాంపియన్‌గా వెళ్లిన భారత్ సూపర్-8 దశలోనే నిష్క్రమించింది.
2010, 2012 ఎడిషన్లలో కూడా భారత్ సూపర్-8 దశకే పరిమితమైంది.2014లో ఫైనల్‌కు చేరినా శ్రీలంక చేతిలో ఓడిపోయింది.2016లో సెమీఫైనల్లో వెస్టిండీస్ చేతిలో పరాజయం పాలైంది.2021లో గ్రూప్ దశలోనే నిష్క్రమించింది.2022లో సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఓడింది.2024లో దక్షిణాఫ్రికాపై గెలిచి రెండోసారి టైటిల్ సాధించింది. ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతోంది టీమిండియా.
