- Advertisement -

తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డులు..తేదీ ఫిక్స్‌

- Advertisement -

జనవరి 1 నుంచి డిసెంబర్ 31, 2025 మధ్య సెన్సార్ సర్టిఫికేట్ పొందిన చిత్రాలకు గాను తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డులను మార్చి 19న ప్రదానం చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఉగాది పండుగను పురస్కరించుకుని ఈ అవార్డుల వేడుకను నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన సచివాలయంలో జరిగిన సమావేశంలో, అవార్డుల జ్యూరీ కమిటీ సభ్యుల సమక్షంలో తీసుకున్నారు.

అవార్డుల కోసం అందిన దరఖాస్తుల పరిశీలన, చిత్రాల స్క్రీనింగ్ ప్రక్రియ ఫిబ్రవరి 6 నుంచి ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డులను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గతంలో అధికారిక ఉత్తర్వులు జారీ చేయగా, అనంతరం తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ నిర్మాతలు, ప్రభుత్వ సంస్థల నుంచి ఎంట్రీలను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.

జాతీయ ఐక్యత, పర్యావరణం, వారసత్వం, చరిత్రను ప్రోత్సహించే చిత్రాలు, డెబ్యూ ఫీచర్ ఫిల్మ్స్, కుటుంబ వినోదాత్మక చిత్రాలు, సామాజిక సందేశం ఉన్న సినిమాలు, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, పిల్లల సినిమాలు, అలాగే కళాకారులు, సాంకేతిక నిపుణులకు వ్యక్తిగత అవార్డులు ఈ కేటగిరీల్లో ఉన్నాయి. అదనంగా డాక్యుమెంటరీలు, షార్ట్ ఫిల్మ్స్, తెలుగు సినిమాలపై పుస్తకాలు, విమర్శాత్మక రచనలు, వ్యాసాలు, ఉర్దూ భాషలో రూపొందిన ఫీచర్ ఫిల్మ్స్‌కూ ఎంట్రీలను ఆహ్వానించారు.

అవసరమైన పత్రాలతో కూడిన దరఖాస్తుల స్వీకరణ గడువు రెండు రోజుల క్రితమే ముగిసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -