- Advertisement -

వారణాసి..మూవీ అప్‌డేట్!

- Advertisement -

తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ పటంపై నిలిపిన దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి, కోట్లాది అభిమానాన్ని సంపాదించిన సూపర్ స్టార్ మహేష్ బాబు కలయిక అంటే అంచనాలు సహజంగానే ఆకాశాన్ని తాకుతాయి. దాదాపు 15 ఏళ్లుగా ప్రేక్షకులను ఊరిస్తున్న ఈ కాంబినేషన్ ఇప్పుడు ‘వారణాసి’ అనే భారీ గ్లోబ్‌ట్రాటర్ అడ్వెంచర్ మూవీగా రూపుదిద్దుకుంటోంది. అయితే ఈ సినిమా వెనుక ఉన్న కష్టం, రాజమౌళి వేసిన పర్ఫెక్షన్ ప్లాన్ చూసి మహేష్ బాబు కూడా ఒక్కసారిగా ఆలోచనలో పడిపోయారట.

పర్ఫెక్షన్ కోసం ఎంత దూరమైనా వెళ్లే రాజమౌళి, ఈ చిత్రంలోని ఒక కీలక యాక్షన్ సీక్వెన్స్ కోసం మహేష్ బాబును ఏకంగా ఏడాది పాటు సిద్ధం చేశారు. రామాయణ నేపథ్యంతో సాగే ఆ యాక్షన్ సీన్ కోసం మహేష్ తన బాడీ లాంగ్వేజ్, ఫిజిక్‌ను పూర్తిగా మార్చుకున్నారు. ఇప్పటివరకు మనం చూసిన మహేష్ ఒకలా ఉంటే, ఈ సినిమాలో కనిపించబోయే మహేష్ పూర్తిగా కొత్తగా ఉంటారని సమాచారం.

కథ వినిపించిన సమయంలో ఈ సినిమా నిడివి లేదా యాక్షన్ సీన్ల వల్ల కాదు, కథలోని గాఢత, గ్లోబల్ స్థాయిలో ఉన్న బాధ్యత వల్ల మహేష్ కొంత ఆందోళనకు గురయ్యారని టాక్. అయినా రాజమౌళి విజన్‌పై నమ్మకంతో మహేష్ పూర్తిగా అంకితమయ్యారు.

ఇప్పటికే సుమారు 50 శాతం షూటింగ్ పూర్తైన ఈ చిత్రం ఒకే భాగంగా, మూడు గంటలకుపైగా నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది. రీజనల్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్‌గా మహేష్ బాబును నిలబెట్టే సినిమా ఇదేనని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది. యాక్షన్ అడ్వెంచర్, టైమ్ ట్రావెల్ అంశాల మేళవింపుతో రాజమౌళి సృష్టించబోయే ఈ విజువల్ వండర్ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -