- Advertisement -

వారణాసి రాజమౌళి రెమ్యునరేషన్‌ షాకే!

- Advertisement -

టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబుతో దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి కలిసి రూపొందిస్తున్న గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ చిత్రం ‘వారణాసి’. భాఈ చిత్రంలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈ చిత్రానికి సంగీతం ఎమ్‌ఎమ్ కీరవాణి అందిస్తుండగా, కథా కథనాన్ని విజయేంద్ర ప్రసాద్ రాశారు. ఈ సినిమాను పూర్తిగా ఐమ్యాక్స్ ఫార్మాట్లో తెరకెక్కిస్తున్నారు.

ఇక ఈ సినిమాకు సంబంధించి రాజమౌళి రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటున్నారనే వార్త టీ టౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది. రూ. 1300 కోట్ల బడ్జెట్‌లో రూపొందుతున్న ఈ భారీ చిత్రం కోసం రాజమౌళి నేరుగా ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోకపోయినా సినిమా ఓవర్సీస్ (విదేశీ) రైట్స్ మొత్తం తన పేమెంట్‌గా తీసుకున్నట్లు సమాచారం. దీని విలువ సుమారు రూ. 160 కోట్లకు పైగా అంచనా వేయబడుతోంది.

మహేష్ బాబు నటుడిగానే కాకుండా లాభాల్లో సైతం వాటా తీసుకోనున్నారు. ఆయ‌నకు రూ.150 నుంచి 200 కోట్ల వరకు లాభాల్లో వాటా పొందే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. ఈ భారీ బయోలాజికల్ అడ్వెంచర్ థ్రిల్లర్‌ – టైమ్ ట్రావెల్, పురాణాల కలయికతో రూపొందుతోందని తెలిపారు. రాజమౌళి బ్రాండ్ మరియు మహేష్ బాబు క్రేజ్ కలిసే బలం, ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను ఆకర్షించే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు భావిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -