శివకార్తికేయన్..తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు. అయితే కొద్దికాలంగా సరైన్ హిట్‌లు లేక ప్రేక్షకులను నిరాశ పరుస్తున్నారు శివ కార్తికేయన్. ఆయన చివరి రెండు సినిమాలు మదరాసి మరియు పరాశక్తి బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌లుగా నిలిచాయి. ముఖ్యంగా పరాశక్తి సినిమా చాలా బోరింగ్‌గా ఉందని విమర్శలు ఎదుర్కొంది.
ఈ పరిస్థితుల్లో తన నెక్ట్స్ ప్రాజెక్టు గురించి మాట్లాడారు శివకార్తికేయన్. తన తదుపరి సినిమాకు సంబంధించిన కథ, దర్శకుడు, నిర్మాత అన్నీ ఖరారయ్యాయి. అధికారిక ప్రకటన త్వరలోనే వస్తుంది. ప్రేక్షకులు నాపై ఆశించే సినిమానే ఇది. పిల్లల నుంచి పెద్దల వరకు అన్ని వయసుల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుంది అని తెలిపారు.
తాత్కాలికంగా SK26 అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి శివకుమార్ దర్శకత్వం వహించనున్నారు. ప్రముఖ నటుడు కమల్ హాసన్ తన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
