- Advertisement -

హర్షిత్ రాణా మోకాలి శస్త్రచికిత్స..అప్‌డేట్!

- Advertisement -

భారత ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హర్షిత్ రాణా తన మోకాలి గాయానికి విజయవంతంగా శస్త్రచికిత్స జరిగినట్లు వెల్లడించారు. ఈ గాయం కారణంగా అతను టీ20 వరల్డ్ కప్ 2026 నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన హర్షిత్, ప్రస్తుతం రికవరీపై దృష్టి పెట్టి మరింత బలంగా తిరిగి రావడానికి సిద్ధమవుతున్నానని తెలిపారు.

టీ20 వరల్డ్ కప్ 2026కు ముందు జరిగిన ప్రిపరేషన్ మ్యాచ్‌ల సమయంలో హర్షిత్ రాణాకు మోకాలి గాయం అయ్యింది. దక్షిణాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో ఈ గాయం తీవ్రతరం కావడంతో, అతన్ని వరల్డ్ కప్ నుంచి తప్పించారు. టోర్నమెంట్‌లో ఫస్ట్ చాయిస్ ప్లేయింగ్ ఎలెవన్‌లో భాగంగా ఉండాల్సిన హర్షిత్‌కు ఇది పెద్ద ఎదురుదెబ్బగా మారింది.

శస్త్రచికిత్స అనంతరం హాస్పిటల్ బెడ్‌పై ఉన్న తన ఫోటోను షేర్ చేస్తూ, “సర్జరీ సక్సెస్‌ఫుల్‌గా పూర్తైంది. ఇప్పుడు రికవరీపై దృష్టి పెట్టి, నాకు ఇష్టమైన ఆటకు తిరిగి రావడమే లక్ష్యం అని హర్షిత్ రాసుకొచ్చాడు.

హర్షిత్ రాణా స్థానంలో మహమ్మద్ సిరాజ్‌ను జట్టులోకి తీసుకున్నట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. అమెరికాతో జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో సిరాజ్ అద్భుత ప్రదర్శన చేశాడు. తొలి ఓవర్‌లోనే ఆండ్రీస్ గౌస్‌ను అవుట్ చేసిన సిరాజ్, రెండో ఓవర్‌లో సైతేజ ముక్కమల్లాను పెవిలియన్‌కు పంపించాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -