- Advertisement -

26న విజయ్-రష్మిక పెళ్లి!

- Advertisement -

విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అప్‌డేట్ వచ్చేసింది. ఈ స్టార్ జంట వివాహానికి సంబంధించిన వార్తలు అధికారికంగా బయటకు రావడంతో సోషల్ మీడియాలో హల్‌చల్ మొదలైంది. తాజాగా వీరి పెళ్లి పత్రిక వైరల్ అవుతోంది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖులను ఆహ్వానిస్తున్నట్టు సమాచారం.

విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న వివాహం ఫిబ్రవరి 26న గ్రాండ్‌గా జరగనుందని తెలుస్తోంది. అయితే పెళ్లి వేడుకను అత్యంత సన్నిహితుల మధ్యే నిర్వహించనున్నట్టు సమాచారం. చాలా కాలంగా వీరిద్దరి గురించి వస్తున్న వార్తలకు ఇప్పుడు అధికారిక ముద్ర పడినట్టైంది. అభిమానులు ఈ శుభవార్తను ఆనందంగా స్వాగతిస్తున్నారు.

పెళ్లి తర్వాత మార్చి 4న హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణలో ఘనంగా రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ వేడుకకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యే అవకాశముంది. ఇప్పటికే సోషల్ మీడియాలో #VijayRashmikaWedding హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.

ఇద్దరూ తమ కెరీర్‌లో బిజీగా ఉన్నప్పటికీ వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించబోతుండటంతో అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ స్టార్ కపుల్ పెళ్లి వేడుక కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -