- Advertisement -

హైదరాబాద్‌లో నరబలి కలకలం!

- Advertisement -

హైదరాబాద్‌లోని చైతన్యపురిలో సంచలనం రేపిన ఘటన చోటుచేసుకుంది. ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న వైశ్యరాజు జ్యువెలర్స్‌లో పనిచేస్తున్న వాచ్‌మన్ ముత్తయ్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కొంతకాలంగా అక్కడ వాచ్‌మన్‌గా పనిచేస్తున్న అతను షాప్‌లోనే మృతిగా కనిపించడంతో కలకలం రేగింది.

దుకాణం ఓపెనింగ్‌కు ముందు నరబలి ఇచ్చారనే ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి. ముత్తయ్యను హత్య చేసి, దాన్ని ఆత్మహత్యగా చూపించే ప్రయత్నం జరుగుతోందని కుటుంబ సభ్యులు, కొందరు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అసలు ఇది ఆత్మహత్యా? లేక హత్యా? అనే కోణంలో పోలీసులు అన్ని ఆధారాలు సేకరిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -