ప్రభాస్ నటిస్తున్న మరో అడ్వెంచర్ మూవీ కల్కి 2898ADకి సంబంధించిన కీలక అప్డేట్ వచ్చేసింది. ప్రభాస్ ప్రధాన పాత్రలోనాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం బడ్జెట్, స్కేల్, కథ పరంగా మరింత భవ్యంగా, ఆసక్తికరంగా ఉండబోతోందని సమాచారం.
ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా, తాజా నివేదికల ప్రకారం హైదరాబాద్లో షూటింగ్ మొదలైనట్టు తెలుస్తోంది. శంకర్పల్లి ప్రాంతంలో ప్రత్యేకంగా నిర్మించిన సెట్లో చిత్రీకరణ జరుగుతోందని అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ షూటింగ్లో పాల్గొన్నట్టు సమాచారం. అయితే షూటింగ్ ప్రారంభంపై చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
మొదటి భాగంలో నటించిన పలువురు నటీనటులు సీక్వెల్లోనూ కనిపించనుండగా బాలీవుడ్ నటి దీపికా పదుకొణే మాత్రం ఈ భాగంలో లేకపోవడం గమనార్హం. ఈ భారీ సైన్స్ ఫిక్షన్-పౌరాణిక చిత్రాన్ని మళ్లీ వైజయంతీ మూవీస్ నిర్మించనుంది.
