- Advertisement -

రాజమండ్రి సూపరింటెండెంట్‌పై సస్పెన్షన్ వేటు

- Advertisement -

రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌పై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. సూపరింటెండెంట్ డాక్టర్ సత్యనారాయణను తక్షణ ప్రభావంతో సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కల్తీ పాల ఘటనలో బాధితులకు సమయానికి సరైన వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు.

ఇదే సమయంలో ఆస్పత్రి కొత్త సూపరింటెండెంట్‌గా డాక్టర్ కెనడిని నియమించారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.

కల్తీ పాల ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా అప్రమత్తమైన ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు.మచిలీపట్నం జిల్లా పరిషత్ సెంటర్ మరియు చిలకలపూడి సెంటర్ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. అనుమానాస్పద పాల విక్రయ కేంద్రాల నుంచి నమూనాలు సేకరించి పరీక్షల కోసం ప్రయోగశాలలకు పంపించారు.

ల్యాబ్ నివేదికల ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఆహార భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -