అత్తమీద కోపం దుత్తమీద చూపినట్లుంది కూటమి ప్రభుత్వ పనితీరు అని మండిపడ్డారు ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల. తిరుమలపై కూటమి సర్కార్ చేసిన పాపాన్ని మహానేత YSR కు చుట్టడం చంద్రబాబు భావ్యం కాదు అన్నారు. వైసీపీ కల్తీ పనులు నాటి వైఎస్‌ఆర్ నుంచే అనడం ఎంతమాత్రం సబబు కాదు. అసెంబ్లీ వేదికగా వైఎస్ఆర్ పై చేసిన ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది అన్నారు.
దివంగత ముఖ్యమంత్రి పై చేసిన వ్యాఖ్యలను సభ రికార్డ్స్ నుంచి తొలగించాలి. దివంగత నేతకు చంద్రబాబు గారు క్షమాపణ చెప్పాలి. YSR గారు 7 కొండలను 2 కొండలు చేయాలని ఏనాడూ అనుకోలేదు. జరిగిందంతా తప్పుడు ప్రచారమే. అప్పటి ప్రతిపక్ష నేతగా బురద చల్లాలని చూసిందే మీరు . తిరుమల పవిత్రతకు పెద్దపీఠ వేసింది ఆనాడు YSR గారే. 7 కొండలు వెంకటేశ్వరుడివే అని 2007లో శాశ్వత GO ఇచ్చి చరిత్ర సృష్టించారు.
హిందూ దేవాలయాల వద్ద అన్యమత ప్రచారం ఉండకుండా కఠిన నిబంధనలు అమలు చేశారు. జీవో 746,747 తెచ్చి తిరుమలను దివ్య క్షేత్రంగా మార్చారు. తిరుమల లడ్డూ పవిత్రతకు రక్షణగా నిలబడ్డారు. లడ్డూకు పేటెంట్ రైట్ సాధించింది 2009 లో నాడు YSR ముఖ్యమంత్రిగా ఉండగానే. వెంకన్న ఆస్తులు అన్యాక్రాంతం అవ్వకుండా ప్రత్యేక చట్టం అమలు చేశారు. తిరుమలలో ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం పెట్టారు. శ్రీ వెంకటేశ్వర వేద విశ్వ విద్యాలయం కట్టారు. వేద పండిట్ ల కోసం ఆనాడే YSR గారు ఆయుష్మాన్ భవ స్కీమ్ అమలు చేశారు. దళితులకు గోవిందుడు దగ్గరవ్వాలని అమలు చేసిన “దళిత గోవిందం” ఆనాడు మహానేత తీసుకున్న గొప్ప నిర్ణయం.
రాష్ట్రంలో మతాలకు అతీతంగా ప్రజలు ఈ నాటికి YSR గారిని దేవుడిగా కొలుస్తున్నారంటే అది ఆయన పాలనకు నిదర్శనం. YCP చేసిన అరాచకాలకు YSR గారికి సంబంధం లేదు. YSR పాలన సంక్షేమ పాలన. YCP పాలన దోచుకు తిన్న పాలన. YCP పార్టీలో YSR లేడు. రాజశేఖర్ రెడ్డిగారు ముమ్మాటికి కాంగ్రెస్ మనిషి. కడవరకు కాంగ్రెస్ లోనే బ్రతికిన మనిషి అన్నారు.
