మలయాళ సినీ దిగ్గజాలు మోహన్‌లాల్ మరియు మమ్ముట్టి కలిసి నటిస్తున్న చిత్రం ‘పేట్రియట్’. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి భారీ ఆసక్తి రేకెత్తిస్తోంది. గత సంవత్సరం విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభించింది. తాజాగా ఈ చిత్ర సెకండ్ లుక్ విడుదల తేదీని మోహన్‌లాల్ వెల్లడించారు.
తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో మోహన్‌లాల్ పేట్రియట్ సెకండ్ లుక్‌కి సంబంధించిన అప్డేట్ ఇచ్చేశారు. రేపు సాయంత్రం 5 గంటలకు సెకండ్ లుక్ రిలీజ్ కానున్నట్లు వెల్లడించారు. మహేష్ నారాయణ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా ఫాహద్ ఫజిల్, నయనతార,దర్శనా రాజేంద్రన్, రేవతి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఫిబ్రవరిలో మేకర్స్ విడుదల చేసిన బీటీఎస్ (Behind The Scenes) వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. శ్రీలంకలో జరిగిన షూటింగ్ సమయంలో తీసిన దృశ్యాలను అందులో చూపించారు. ఎయిర్‌బేస్‌లో హెలికాప్టర్లు, ఫైటర్ జెట్లు మధ్య చిత్రీకరించిన సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. మోహన్‌లాల్, మమ్ముట్టి ఇద్దరూ కలిసి కనిపించడం అభిమానుల్లో ఉత్సాహం పెంచింది. 18 సంవత్సరాల తర్వాత ఈ ఇద్దరు లెజెండ్స్ కలిసి నటించడం ప్రత్యేకతగా నిలిచింది.
వీడియోలో ఫహద్ ఫాసిల్ ఫైటర్ జెట్ కాక్‌పిట్‌లో కూర్చుని టెక్నీషియన్ నుంచి వివరాలు తెలుసుకుంటున్న దృశ్యాలు కూడా ఉన్నాయి. ఇటీవల ఫహద్ ఫాసిల్ ఈ చిత్రంలో తాను విలన్ పాత్ర పోషిస్తున్నట్లు వెల్లడించారు.
