- Advertisement -

షాకింగ్..వివాహ వేడుకలో పెళ్లి కూతురిపై కాల్పులు

- Advertisement -

బీహార్ రాష్ట్రంలోని బక్సర్ జిల్లాలో జరిగిన షాకింగ్ ఘటన కలకలం రేపింది. ఓ వివాహ వేడుకలో పెళ్లి కూతురిపై దుండగుడు కాల్పులు జరపడం తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఆనందోత్సాహాల మధ్య సాగాల్సిన పెళ్లి వేడుక క్షణాల్లో విషాదంగా మారింది.

సమాచారం ప్రకారం, పెళ్లి కార్యక్రమం జరుగుతున్న సమయంలో అకస్మాత్తుగా ఒక వ్యక్తి అక్కడికి చేరుకుని రెప్పపాటులో పెళ్లికూతురిపై కాల్పులు జరిపాడు. కాల్పులు జరిపిన వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనతో పెళ్లి కొడుకు, కుటుంబ సభ్యులు, బంధువులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వేడుకలో పాల్గొన్న అతిథులు భయాందోళనలకు లోనయ్యారు.

తీవ్రంగా గాయపడిన పెళ్లికూతురిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమె పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం అత్యవసర చికిత్స అందిస్తున్నారు. కాల్పులకు కారణాలు ఇంకా తెలియరాలేదు. వ్యక్తిగత వైరం లేదా ఇతర కారణాల కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఘటనపై కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న నిందితుడి కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -