హోళీ పండుగ అంటే పిల్లలకు రంగులు, నీటి ఆటలు, పెద్ద శబ్దాలతో నిండిన సంబరాలు. అయితే చెవి, ముక్కు, గొంతు (ENT) సమస్యలతో బాధపడుతున్న పిల్లలకు ఈ వేడుకల్లో దాగి ఉన్న ఆరోగ్య ప్రమాదాలు ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. సరైన అవగాహన, ముందస్తు జాగ్రత్తలు ఉంటే పిల్లలు సురక్షితంగా హోళీని ఆనందించవచ్చని చెబుతున్నారు.
కలుషిత నీరు, దుమ్ము, పెద్ద శబ్దాలు, ఉష్ణోగ్రత మార్పులు – ఇవన్నీ పిల్లల చెవులు, సైనసులకు ఇబ్బంది కలిగించవచ్చు. రసాయన రంగులు లేదా మురికి నీరు చెవుల్లోకి వెళితే ఇన్ఫెక్షన్లు రావచ్చు.
చెవిలో గ్రమెట్స్ ఉన్న పిల్లలకు నీరు లోపలికి చేరే ప్రమాదం ఎక్కువ. కాటన్ కంటే సిలికాన్ ఇయర్‌ప్లగ్స్ లేదా సరైన స్విమ్ క్యాప్ ఉపయోగించాలి. ఆటల తర్వాత చెవి బయట భాగాన్ని మాత్రమే మృదువుగా తుడవాలి. నొప్పి, జ్వరం, చెవి నుంచి ద్రవం వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
తరచూ చెవి ఇన్ఫెక్షన్లు ఉన్నవారు..నీటి బెలూన్లు చెవుల దగ్గర పేలితే ఒత్తిడి పెరుగుతుంది. పిల్లలు తలకు లక్ష్యంగా కొట్టకుండా జాగ్రత్తపడాలి.
టాన్సిల్ ఆపరేషన్ తర్వాత…గొంతు శస్త్రచికిత్స తర్వాత రెండు వారాలు జాగ్రత్త అవసరం. అరవడం, మసాలా ఆహారం, చల్లని పానీయాలు గొంతుకు ఇబ్బంది కలిగించవచ్చు.
అలర్జీలు, సైనస్ సమస్యలు..పొడి రంగులు తుమ్ములు, ముక్కు దిగుబడి పెంచవచ్చు. ముక్కు చుట్టూ పెట్రోలియం జెల్లీ రాయడం, మాస్క్ వాడటం సహాయపడుతుంది. ఇంటికి వచ్చిన తర్వాత సలైన్ వాష్ చేయాలి.లౌడ్ స్పీకర్లు, బాణాసంచా పిల్లల వినికిడిపై ప్రభావం చూపవచ్చు. అవసరమైతే నాయిస్-రెడక్షన్ ఇయర్‌మఫ్స్ ఉపయోగించాలి.
వెంటనే గుర్తించాల్సిన లక్షణాలు
చెవి నొప్పి లేదా ద్రవం
గొంతు నొప్పి
జ్వరం
మింగడంలో ఇబ్బంది
నోటి నుంచి రక్తస్రావం
సరైన జాగ్రత్తలతో హోళీని పిల్లలు సురక్షితంగా ఆనందించవచ్చు.
