- Advertisement -

విశాఖకు వైఎస్ జగన్..వివరాలివే

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ ఎల్లుండి విశాఖపట్నం మరియు అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఉదయం 11:30 గంటలకు అల్లూరి జిల్లాలోని అరకు నియోజకవర్గ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కుమారుడి వివాహ వేడుకకు జగన్ హాజరవుతారు. నూతన దంపతులను ఆశీర్వదించి కుటుంబ సభ్యులతో సమావేశమవుతారు. ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉంది.

తర్వాత మధ్యాహ్నం 1:30 గంటలకు విశాఖపట్నంలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ నివాసానికి జగన్ వెళ్లనున్నారు. ఇటీవల వివాహం జరిగిన గణేష్ కుమారుడు దంపతులను ఆశీర్వదించనున్నారు. ఈ సందర్శన సందర్భంగా పార్టీ కార్యకర్తలతో కూడా జగన్ సమావేశమయ్యే అవకాశముంది.

జగన్ పర్యటన నేపథ్యంలో విశాఖ, అల్లూరి జిల్లాల్లో పార్టీ శ్రేణులు ఏర్పాట్లు ప్రారంభించాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -