- Advertisement -

వీడియో..దిగుతుండగానే పైకి దూసుకెళ్లిన లిఫ్ట్!

- Advertisement -

గుజరాత్ లో లిఫ్ట్ ప్రమాదం తృటిలో తప్పింది. వత్సల్‌భాయ్ అనే వ్యక్తి అద్భుతంగా ప్రాణాలతో బయటపడిన ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డు కావడంతో వైరల్‌గా మారింది.

సమాచారం ప్రకారం, వత్సల్‌భాయ్ తన ఫ్లోర్‌కు చేరుకున్న తర్వాత లిఫ్ట్ తలుపులు తెరుచుకోవడంతో బయటకు దిగేందుకు ప్రయత్నించారు. అయితే ఆయన పూర్తిగా బయటకు రావడానికి ముందే లిఫ్ట్ ఒక్కసారిగా వేగంగా పైకి దూసుకెళ్లింది. ఈ అనూహ్య పరిణామంతో అక్కడున్నవారు షాక్‌కు గురయ్యారు.

అదృష్టవశాత్తూ వత్సల్‌భాయ్ అప్పటికే ఒక అడుగు బయటకు వేసి ఉండటంతో తీవ్ర ప్రమాదం తప్పింది. లిఫ్ట్ పైకి కదిలిన సమయంలో ఆయనకు స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి. వెంటనే స్థానికులు సహాయం చేసి ఆయనను సురక్షిత ప్రదేశానికి తరలించారు.

లిఫ్ట్‌లో సాంకేతిక లోపం కారణంగానే ఈ ఘటన జరిగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -