- Advertisement -

MP కేశినేని..M అంటే మట్టి, P అంటే పేకాటగా మార్చేశాడు!

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. ఎమ్మెల్యే కోలికపూడి శ్రీనివాసరావు వర్సెస్ టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని మధ్య వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా మరోసారి చిన్నిపై కొలికపూడి సంచలన కామెంట్స్ చేశారు.

ఎంపీ పదానికి కొత్త అర్థం చెబుతూ కొలికపూడి తీవ్ర వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా కలకలం రేపింది. కేశినేని చిన్ని దృష్టిలో ఎంపీ అంటే “మెంబర్ ఆఫ్ పార్లమెంట్” కాదని, “M అంటే మట్టి, P అంటే పేకాట”గా మార్చేశారని కొలికపూడి ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు పార్టీ అంతర్గత విభేదాలను మరింత బహిర్గతం చేశాయి.

తిరువూరులో జరిగిన ఘటనతో ఈ వివాదం తారాస్థాయికి చేరింది. గంపలగూడెంలోని నెమలి వేణుగోపాలస్వామి కళ్యాణం సందర్భంగా పట్టువస్త్రాలు ఎవరు సమర్పించాలన్న అంశంపై ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మాటల యుద్ధం కాస్త తోపులాటకు దారితీసింది. స్వామివారి సమక్షంలోనే ఇరువర్గాల నాయకులు బాహాబాహీకి దిగడం అక్కడి భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది.

కొలికపూడి తలపై ఉన్న పట్టువస్త్రాలను లాక్కునేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. ఈ ఘటనతో టీడీపీలో మరోసారి వర్గపోరు భగ్గుమన్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -