- Advertisement -

మ్యాడ్ స్క్వేర్..అనవసరంగా చేశా!

- Advertisement -

యువ నటుడు సంగీత్ శోభన్ త్వరలో ప్రేక్షకులను భయపెట్టుతూ నవ్వించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన నటించిన హారర్–కామెడీ చిత్రం ‘రకాసా’ 2026 ఏప్రిల్‌లో థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సంగీత్ శోభన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి.

ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సంగీత్ శోభన్….తన గత చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’ గురించి ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశారు. “నాకు మరోసారి ఆలోచించే అవకాశం ఇచ్చి ఉంటే, నేను ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమా చేసేవాడిని కాదేమో” అని చెప్పారు.

మ్యాడ్ సినిమా విజయానంతరం తర్వాత ఏం చేయాలో నాకు స్పష్టంగా తెలియలేదు. ఆ విజయాన్ని ఆస్వాదిస్తున్న సమయంలోనే ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. ఆ సినిమాను చాలా తక్కువ సమయంలో పూర్తి చేశాం. ఇప్పుడు చూస్తే మేము కొంచెం భిన్నంగా చేయవచ్చు అనిపిస్తోంది. నిర్మాత నాగ వంశీ అన్న కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు అని తెలిపారు.

సంగీత్ శోభన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -