- Advertisement -

ఉమెన్స్ డే..బన్నీ స్పెషల్ గిఫ్ట్!

- Advertisement -

అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున తన తల్లికి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చారు అల్లు అర్జున్. తన తల్లి అల్లు నిర్మలకు కొత్త కారు బహుమతిగా ఇచ్చారు. మహిళత్వం, మాతృత్వం మరియు తల్లిపట్ల ఉన్న కృతజ్ఞతను తెలియజేస్తూ ఆయన ఈ బహుమతిని అందించారు.

ఈ సందర్భంగా అల్లు అర్జున్, ఆయన తల్లి అల్లు నిర్మలతో కలిసి కొత్త కారుతో తీసుకున్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు మరియు సినీ ప్రముఖులు కూడా ఈ మధురమైన క్షణాన్ని అభినందిస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

ప్రస్తుతం అల్లు అర్జున్ కొత్త ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్ AA22 x A6 షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అభిమానులు కూడా ఈ సినిమాకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -