- Advertisement -

2027లోనే ఎన్టీఆర్-నీల్ మూవీ!

- Advertisement -

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. డ్రాగన్ టైటిల్‌గా వస్తున్నట్లు తెలుస్తోండగా సినిమా రిలీజ్‌కు సంబంధించిన అప్‌డేట్ వచ్చేసింది.

ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని యాక్షన్ సన్నివేశాలను జోర్డాన్‌లో చిత్రీకరించారు. ఈ సినిమా 2027లో థియేటర్లలో విడుదల కానుందని వెల్లడించారు. ఇక ఎన్టీఆర్ చివరిసారిగా నటించిన దేవర..2024లో విడుదలైంది. అందువల్ల అభిమానులు తమ అభిమాన హీరోను మళ్లీ వెండితెరపై చూడాలంటే కొంతకాలం వేచి చూడాల్సి ఉంటుంది.

సినిమా గురించి మాట్లాడుతూ రవి బస్రూర్ మాట్లాడుతూ..ఈ సినిమా చాలా బాగా రూపుదిద్దుకుంటోంది. ప్రశాంత్ నీల్‌తో పనిచేయడం ఎప్పుడూ అద్భుతమైన అనుభవం. ఒక దర్శకుడిగా ఆయనకు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ లేదా పాటల విషయంలో ఏం కావాలో చాలా స్పష్టంగా తెలుసు. ప్రతి సన్నివేశాన్ని పూర్తిగా అర్థం చేసుకుని పని చేస్తారు. అందుకే మేమిద్దరం కలిసి బాగా పని చేయగలుగుతున్నాం అని తెలిపారు.

ఈ చిత్రంలో హీరోయిన్‌గా రుక్మిని వసంత్ నటిస్తుండగా, బాలీవుడ్ ప్రముఖ నటుడు అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -