- Advertisement -

రాజు వెడ్స్ రాంబాయి..సినిమా తరహా ఘటన

- Advertisement -

హైదరాబాద్ నగర పరిధిలోని పోచారంలో సంచలన ఘటన చోటుచేసుకుంది. సినిమా కథను తలపించేలా ఓ యువకుడు పెళ్లికి నిరాకరించిన యువతిపై దారుణానికి పాల్పడ్డాడు.

పోలీసుల సమాచారం ప్రకారం మనోహర్ అనే యువకుడితో ఓ యువతికి గతంలో వివాహం నిశ్చయమైంది. అయితే తరువాత మనోహర్‌కు ఎయిడ్స్ ఉందని తెలిసిన యువతి అతడిని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించింది. ఈ విషయం మీద ఇద్దరి కుటుంబాల మధ్య విభేదాలు నెలకొన్నాయి.

ఈ నెల 11న మనోహర్ యువతి ఇంటికి వెళ్లి తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. అయితే యువతి మళ్లీ నిరాకరించడంతో ఆగ్రహానికి గురైన అతడు ఆమెకు ఎయిడ్స్ ఉన్న రక్తాన్ని ఇంజెక్షన్ ద్వారా ఎక్కించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఘటన తర్వాత యువతి అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు వెంటనే వైద్య సహాయం అందించారు.

ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు మనోహర్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో మనోహర్‌తో పాటు అతని తల్లిదండ్రులకు కూడా గతంలోనే ఎయిడ్స్ ఉన్నట్లు వెల్లడైనట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సంఘటన వెలుగులోకి రావడంతో ప్రాంతంలో తీవ్ర ఆందోళన నెలకొంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -