- Advertisement -

సుమకు రాజీవ్..స్పెషల్ సర్‌ప్రైజ్

- Advertisement -

సినీ, టెలివిజన్ రంగంలో ప్రముఖ జంటగా పేరొందిన రాజీవ్ కనకాల – సుమ కనకాల మరోసారి అభిమానులను ఆకట్టుకున్నారు. తన సతీమణి సుమ పుట్టినరోజు సందర్భంగా రాజీవ్ కనకాల సోషల్ మీడియాలో ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.

సాధారణంగా నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలి అని ఆశీర్వదిస్తారు. కానీ రాజీవ్ మాత్రం కాస్త భిన్నంగా ఆలోచించారు. “నిండు నూరేళ్లు కాదు… 120–130 ఏళ్లు జీవించి, మనవలు–మనవరాళ్లతో సంతోషంగా ఉండాలి” అంటూ ప్రేమగా శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందేశాన్ని ఆయన X (మునుపటి ట్విట్టర్) లో పోస్ట్ చేయగా, అభిమానులు ఆసక్తిగా స్పందిస్తున్నారు. రాజీవ్ వినూత్నంగా చెప్పిన విషెస్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

ఇదిలా ఉండగా, యాంకర్ సుమ తన చురుకైన వ్యాఖ్యానంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఈ జంట మధ్య ఉన్న అనుబంధం, సరదా మాటలు అభిమానులను ఎప్పుడూ అలరిస్తూనే ఉంటాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -