హైదరాబాద్‌లోని మొయినాబాద్ ఫాం హౌస్ డ్రగ్స్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుల కస్టడీ పిటిషన్‌పై నేడు తీర్పు ఇవ్వనుంది కోర్టు. ఫాం హౌస్‌లో 24 సార్లు పార్టీలు జరిగినట్టు గుర్తించారు పోలీసులు.
ఇతర ఫాంహౌస్‌లలో జరిగిన డ్రగ్స్ పార్టీలపై సిట్ ఫోకస్ చేసింది. డ్రగ్స్ పార్టీలో ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ ప్రముఖల పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. డ్రగ్స్ సరఫరా చేస్తున్న అభిషేక్ సింగ్‌ను విచారిస్తున్నారు పోలీసులు.
రోహిత్ రెడ్డికి 24 సార్లు డ్రగ్స్ సరఫరా చేసినట్టు గుర్తించారు. డ్రగ్స్ కేసులో మాఫియా కోణం ఉన్నట్టు అనుమానాలు వ్యక్తం అవుతుండగా నమిత్ శర్మను షార్ప్ షూటర్‌గా గుర్తించారు పోలీసులు.
ఢిల్లీ, పంజాబ్ కేంద్రంగా పని చేస్తున్న అంతర్జాతీయ మాఫియాతో సంబంధం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మలను విచారిస్తే తెర మీదికి మరి కొందరి పేర్లు వస్తాయని భావిస్తోంది సిట్.
