టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రం రౌడీ జనార్థనతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాకు దర్శకుడు రవి కిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పూర్తిగా భిన్నమైన లుక్‌లో కనిపించనున్నాడు. రఫ్, రా స్టైల్‌తో ఆయన పాత్ర మరింత మాస్ అప్పీల్‌ను తెచ్చేలా రూపొందిస్తున్నారు.
ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా ముంబై స్లమ్స్‌లో తెరకెక్కించనున్న భారీ యాక్షన్ సీక్వెన్స్ నిలవనుంది. ఈ ఫైట్ సన్నివేశాన్ని చాలా గ్రాండ్‌గా, రియలిస్టిక్‌గా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సీన్ ప్రేక్షకులకు థ్రిల్లింగ్ అనుభూతిని కలిగించేలా డిజైన్ చేస్తున్నారని తెలుస్తోంది. సినిమాకు ఇది హైలైట్‌గా మారే అవకాశం ఉంది.
విజయ్ దేవరకొండ మేకోవర్, కొత్త బ్యాక్‌డ్రాప్, యాక్షన్ ఎలిమెంట్స్ కారణంగా రౌడీ జనార్ధనపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం పూర్తి స్థాయి మాస్ ఎంటర్టైనర్గా నిలవనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తంగా రౌడీ జనార్థనతో విజయ్ దేవరకొండ మరోసారి తన స్టైల్‌ను కొత్తగా చూపించేందుకు సిద్ధమవుతున్నాడు.
