హైదరాబాద్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కుటుంబంలో మరోసారి దుర్ఘటన కలిచివేసింది. నిన్న రాత్రి ఓఆర్‌ఆర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో మాగంటి గోపినాథ్ పెద్ద కుమార్తె అక్షర తీవ్రంగా గాయపడ్డారు. ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.
ప్రాథమిక సమాచారం ప్రకారం, కారు చక్రాలు ఊడిపోవడంతో నియంత్రణ తప్పి రోడ్డుపై అడ్డంగా నిలిచిన డీసీఎంను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్షర తీవ్ర గాయాల పాలయ్యారు.
ప్రమాదం అనంతరం వెంటనే ఆమెను సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స కొనసాగుతోంది. వైద్యులు ఆమె ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు విచారణ కొనసాగుతోంది.
ఇప్పటికే మాగంటి గోపినాథ్ మరణంతో దుఃఖంలో ఉన్న కుటుంబానికి ఈ ఘటన మరో పెద్ద దెబ్బగా మారింది.
