టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఆదర్శ కుటుంబం. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తుండగా ఈ సినిమా షూటింగ్ సైలెంట్‌గా జరుగుతోంది.
అయితే సినిమాటోగ్రాఫర్ రవి కె. చంద్రన్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ చిత్రానికి సంబంధించిన ఒక నెలపాటు షూటింగ్ షెడ్యూల్ పూర్తైంది. ప్రస్తుతం టీమ్ చిన్న విరామంలో ఉండగా, త్వరలోనే మళ్లీ షూటింగ్ ప్రారంభం కానుంది.
ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో హీరోయిన్గా శ్రీనిధి శెట్టి నటిస్తోండగా సత్య, యోగి బాబు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి హర్షవర్ధన్ రమేశ్వర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందుతోంది. మేకర్స్ ఈ చిత్రాన్ని వచ్చే సమ్మర్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
