- Advertisement -

LOVE U చెప్పిన ప్రొఫెసర్..చెప్పుతో కొట్టిన విద్యార్థిని

- Advertisement -

కర్నాటకలోని నెలమంగళా ప్రాంతంలో ఉన్న ఒక మెడికల్ కాలేజీలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. విద్యార్థులకు విద్య, విలువలు బోధించాల్సిన ప్రొఫెసర్, క్లాస్‌రూమ్‌లోనే హద్దులు దాటి ప్రవర్తించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.

వివరాల్లోకి వెళ్తే, ఓ ప్రొఫెసర్ తన క్లాస్‌లో ఉన్న విద్యార్థినిపై అనుచితంగా ప్రవర్తిస్తూ, అందరి ముందే “I LOVE U” అని చెప్పాడు. ఈ అనూహ్య ఘటనతో క్లాస్‌లో ఉన్న విద్యార్థులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

ప్రొఫెసర్ ప్రవర్తనపై తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ విద్యార్థిని, వెంటనే స్పందిస్తూ అతనిని చెప్పుతో కొట్టింది. ఈ ఘటనతో అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. విద్యార్థిని ధైర్యంగా స్పందించిన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

ఈ సంఘటన తర్వాత కాలేజీ యాజమాన్యం అప్రమత్తమై, ఘటనపై విచారణ చేపట్టినట్లు సమాచారం. ప్రొఫెసర్ ప్రవర్తనపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యాసంస్థల్లో ఇలాంటి ఘటనలు జరగడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -