- Advertisement -

ప్రియదర్శి.. ‘సుయోధన’ రివ్యూ

- Advertisement -

ప్రియదర్శి నటించిన తాజా చిత్రం ‘సుయోధన’. థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దర్శకుడు వై.ఎస్. మాధవ్ రెడ్డి తెరకెక్కించారు.ప్రజ్వలా లైన్ క్రియేషన్స్ బ్యానర్‌ నిర్మించగా ప్రియదర్శి సరసన ద్రిషిక చందర్ హీరోయిన్‌గా నటించారు.డైలాగ్ కింగ్ సాయి కుమార్, సీనియర్ హీరోయిన్ ప్రేమ కీలక పాత్రల్లో నటించగా శ్రీరామ నవమి సందర్భంగా ఇవాళ (మార్చి 27న) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది?…ప్రియదర్శికి మరో విజయాన్ని అందుకున్నాడా? అన్నది రివ్యూలో చూద్దాం.

కథ:

ఈ కథ ఒక యువ ఫోలీ ఆర్టిస్ట్ జీవితాన్ని చుట్టుముట్టి తిరుగుతుంది. చిన్నప్పటి నుంచే అతనికి “సుయోధన” అనే ఒక మిస్టీరియస్ వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. అతని జీవితంలో జరిగే విచిత్ర సంఘటనలు, అతనిపై పడే హత్య ఆరోపణలు కథను ఆసక్తికరంగా మలుస్తాయి. ఈ కేసు విచారణలో అతని గతం, కుటుంబ రహస్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతూ కథ మరింత ట్విస్టులతో ముందుకు సాగుతుంది. ఎందుకిలా జరుగుతోందని ఆరా తీసిన హీరోకి.. తనకు ఏదైనా ప్రమాదం ఉన్నప్పుడే ఇలా జరుగుతుందని తెలుసుకుంటాడు. ఒకానొక సందర్భంలో అతని తండ్రి ప్రకాష్‌నే వరుణ్‌కు దుర్యోధనుడిగా కనిపిస్తాడు. అదే సమయంలో తండ్రి కొడుకులపై మర్డర్ అటెంప్ట్ జరుగుతుంది, తండ్రి చనిపోతాడు. వరుణ్ తండ్రిని చంపింది ఎవరు?..సినిమాలో అసలు సుయోధన ఎవరు? అన్నది తెరపై చూడాల్సిందే.

సినిమాలో ప్లస్ పాయింట్స్..ప్రియదర్శి నటన,కొత్త కాన్సెప్ట్,సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్,సౌండ్ & బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.ప్రియదర్శి ఈ సినిమాలో తన కెరీర్‌లోని బెస్ట్ పెర్ఫార్మెన్స్‌లలో ఒకటి ఇచ్చాడని చెప్పవచ్చు. అతని పాత్రలో ఉన్న మానసిక సంఘర్షణను బాగా చూపించాడు. హీరోయిన్ ద్రిషిక చందర్ తన పాత్రకు న్యాయం చేసింది. సాయికుమార్ వంటి సీనియర్ నటులు కథకు బలాన్ని ఇచ్చారు.

స్లో నేరేషన్ (ఫస్ట్ హాఫ్),కొన్ని సీన్స్ క్లిష్టంగా అనిపించవచ్చు. ఇక సాంకేతికంగా సినిమా సూపర్బ్. సౌండ్ డిజైన్ సినిమా హైలైట్‌గా నిలిచింది. సినిమాటోగ్రఫీ థ్రిల్లింగ్ ఫీల్‌ను బాగా తీసుకువచ్చింది.బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సస్పెన్స్‌ను పెంచింది.కథనం నెమ్మదిగా సాగినప్పటికీ, ఇంటర్వెల్ తర్వాత ఆసక్తి పెరుగుతుంది.

ఓవరాల్‌గా రోటిన్ సినిమాలకు భిన్నంగా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో, మిస్టరీ-థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం సుయోధన. కంటెంట్ ఆధారంగా నడిచే సినిమాలను ఇష్టపడే వారికి ఇది నచ్చే అవకాశం ఉంది. ఓవరాల్‌గా ఈ వీకేండ్‌లో మంచి కిక్ ఇచ్చే చిత్రం సుయోధన.

రేటింగ్: 3/ 5

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -