- Advertisement -

King 100: సినిమా కథ లీక్!

- Advertisement -

కింగ్ నాగార్జున తన 100వ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నారు. తాత్కాలికంగా “కింగ్ 100” అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి తమిళ దర్శకుడు కార్తిక్ దర్శకత్వం వహిస్తున్నారు.

నాగార్జున సినీ ప్రయాణంలో 40 ఏళ్లు పూర్తి చేసిన సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి వివరాలు వెల్లడించారు.ప్రస్తుతం సినిమా షూటింగ్ సుమారు 45% పూర్తయిందని, ఇంకా టైటిల్‌ను ఫైనల్ చేయలేదని తెలిపారు.ఈ సినిమా పూర్తిగా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోందని నాగార్జున చెప్పారు.

కథలో తండ్రి–కూతురు భావోద్వేగం ప్రధానంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాలో నాగార్జునను 25 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు వివిధ వయస్సుల్లో చూపించేందుకు ఆధునిక టెక్నాలజీ ఉపయోగించనున్నారు.ఈ చిత్రంలో ప్రముఖ నటీమణులు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు:

ఈ భారీ ప్రాజెక్ట్‌ను అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తుండగా కింగ్ 100పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు ప్రకటించే అవకాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -