- Advertisement -

రాకాసా..పెయిడ్ ప్రీమియర్స్!

- Advertisement -

మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన తాజా చిత్రం “రాకాసా” థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ ఫాంటసీ కామెడీ చిత్రం 2026 ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో సంగీత్ శోభన్ హీరోగా నటిస్తుండగా, నయన్ సారిక హీరోయిన్‌గా కనిపించనున్నారు. ఈ చిత్రంతో మనసా శర్మ దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు.

సినిమా విడుదలకు ఒక రోజు ముందుగా, అంటే ఏప్రిల్ 2, 2026న, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని కొన్ని ఎంపిక చేసిన నగరాల్లో పెయిడ్ ప్రీమియర్స్ నిర్వహించేందుకు చిత్రబృందం నిర్ణయించింది.

ఈ చిత్రంలో ప్రముఖ నటులు వెన్నెల కిషోర్,తనికెళ్ల భరణి,గెటప్ శ్రీను,బ్రహ్మాజీ కీలక పాత్రల్లో నటిస్తుండగా సంగీతం అనుదీప్ దేవ్ అందించారు. Pink Elephant Pictures సంస్థ, Zee Studiosతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించింది.

మొత్తంగా పెయిడ్ ప్రీమియర్స్‌తో ముందుగానే ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నంలో ఉన్న “రాకాసా” సినిమా మీద మంచి అంచనాలు నెలకొన్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -