మెగా హీరో సాయి దుర్గా తేజ్ తన తదుపరి చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు తాత్కాలికంగా SDT19 అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఈ చిత్రానికి KA మూవీతో గుర్తింపు పొందిన దర్శకులు సుజిత్, సందీప్ దర్శకత్వం వహించనున్నారు.
ఈ సినిమా ప్రీ-లుక్ పోస్టర్‌లో సాయి దుర్గా తేజ్ ఓ యోధుడిగా కనిపిస్తారు. అడవిలో నిలబడి ఆకాశాన్ని చూస్తూ ఉండగా, అతని ముందు ఒక రహస్యమైన కొండ కనిపించడం ద్వారా ఫాంటసీ అంశాన్ని సూచించారు. పోస్టర్‌పై ఉన్న క్యాప్షన్:“Secrets of the ages.. Power beyond imagination.”
ఈ ప్రాజెక్ట్ ద్వారా సాయి దుర్గా తేజ్ తన స్వంత నిర్మాణ సంస్థ విజయదుర్గ ప్రొడక్షన్స్ ను ప్రారంభిస్తున్నారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ సంస్థతో కలిసి సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమా నటీనటులు మరియు సాంకేతిక బృందం గురించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
