- Advertisement -

ఆది సాయి కుమార్…సైరాబాను!

- Advertisement -

శంభాలతో సక్సెస్ రుచి చూశారు టాలీవుడ్ నటుడు ఆది సాయి కుమార్. శంభాల తర్వాత తన తదుపరి ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు ఫణి కృష్ణ సిరికి దర్శకత్వం వహించనుండగా హీరోయిన్‌గా బంధవి శ్రీధర్ నటించనున్నారు.

ఈ చిత్రానికి “సైరాబాను” అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ప్రేమాత్మక భావాలను ప్రతిబింబించేలా కలర్‌ఫుల్, డ్రీమీ పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్‌లో పైభాగంలో పెద్ద హార్ట్ షేప్‌లో పింక్ క్లౌడ్ కనిపిస్తూ, “A Fun Filled Journey of Love, Faith & Destiny” అనే ట్యాగ్‌లైన్‌ను చూపించారు.

పోస్టర్ దిగువ భాగంలో ఫాంటసీ స్టైల్ విజువల్స్‌తో చార్మినార్, విశాఖపట్నం బీచ్ రోడ్, అలాగే గోదావరి బ్రిడ్జ్ రాజమండ్రి వంటి ప్రదేశాలను ప్రేరణగా తీసుకున్న సన్నివేశాలు కనిపిస్తున్నాయి. మొత్తం పోస్టర్‌కు మృదువైన, ఊహాజనిత లుక్‌ను ఇచ్చారు.

ఈ సినిమా హిందూ-ముస్లిం ప్రేమకథగా, హాస్యభరితంగా తెరకెక్కనుందని సమాచారం. కథ ప్రధానంగా రాజమండ్రి మరియు హైదరాబాద్ నగరాల నేపథ్యంలో సాగనుంది. ఈ చిత్రం ఈరోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

ఇటీవల K Ramp సినిమాతో విజయాన్ని అందుకున్న నిర్మాత రాజేష్ దండా ఈ చిత్రాన్ని హాస్య మూవీస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. సహ నిర్మాతగా కృష్ణకాంత్ పరుచూరి వ్యవహరిస్తున్నారు.టెక్నికల్ టీమ్‌లో సినిమాటోగ్రాఫర్‌గా రామ్ రెడ్డి, సంగీత దర్శకుడిగా శేఖర్ చంద్ర, ఎడిటర్‌గా చోటా కె ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్‌గా బ్రహ్మ కడలి పనిచేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -