- Advertisement -

ప్రియుడితో కలిసి భర్తను చంపే ప్రయత్నం..చివరికి!

- Advertisement -

హైదరాబాద్‌లోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. మహేష్ అనే వ్యక్తి తన భార్య సమత, ఆమె ప్రియుడు ఉపేందర్ గౌడ్ కలిసి తనను హత్య చేయాలని ప్రయత్నించారని ఆరోపించాడు. గత ఏడాది ఆగస్టు నెలలో మ్యాట్రిమోనీ ద్వారా సమతను వివాహం చేసుకున్నానని తెలిపాడు.

తనకు న్యాయం జరగడం లేదనే ఆవేదనతో మహేష్ సూసైడ్ అటెంప్ట్ చేసి, ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. ఆ వీడియోలో తనపై జరుగుతున్న అన్యాయాన్ని వివరించాడు.ఇప్పటికే రెండు నెలల క్రితం చైతన్యపురి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని మహేష్ ఆరోపించాడు. పలుమార్లు అధికారులను సంప్రదించినా స్పందన లేదని చెప్పాడు.

“ఇప్పటికైనా పోలీసులు స్పందించి న్యాయం చేయాలి” అంటూ మహేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. తన ప్రాణానికి ముప్పు ఉందని, వెంటనే రక్షణ కల్పించాలని కోరాడు.ఈ ఘటనపై పోలీసులు స్పందించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఆరోపణల నిజానిజాలు బయటకు రావాల్సి ఉంది.

మొత్తానికి, ఈ సంఘటన హైదరాబాద్‌లో చర్చనీయాంశంగా మారింది. బాధితుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -