- Advertisement -

పఠాన్‌ రికార్డులు బ్రేక్ చేసిన ధురంధర్ 2!

- Advertisement -

బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్ 2’ విజయయాత్ర కొనసాగుతోంది. తాజాగా ఈ చిత్రం యునైటెడ్ కింగ్‌డమ్ (UK) బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1800 కోట్ల రూపాయలు వసూలు చేసిన ఈ బ్లాక్ బస్టర్, ఇప్పుడు యూకేలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ రికార్డును అధిగమించింది.

మూడేళ్ల క్రితం విడుదలైన ‘పఠాన్’ యూకేలో £4.380 మిలియన్లు వసూలు చేసి అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పుడు రణవీర్ సింగ్ హీరోగా వచ్చిన ‘ధురంధర్: ది రివెంజ్’ (ధురంధర్ 2) £4.388 మిలియన్ల వసూళ్లతో ఆ రికార్డును తుడిచిపెట్టేసింది.

ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇంకా విజయవంతంగా ప్రదర్శించబడుతుండటంతో మరిన్ని రికార్డులు బద్దలయ్యే అవకాశం ఉంది. మరోవైపు, ఈ భారీ చిత్రం ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే జియో హాట్‌స్టార్ (Jio Hotstar) లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -