- Advertisement -

పెద్ది..రిలీజ్ డేట్‌పై క్లారిటీ!

- Advertisement -

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ (Peddi) విడుదల తేదీకి సంబంధించి ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా జూన్ 26, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

నిజానికి ఈ సినిమాను ముందుగా మార్చి 26న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే, కొన్ని పెండింగ్ పనుల కారణంగా అది ఏప్రిల్ 30కి వాయిదా పడింది. సినిమా మళ్లీ జూన్‌కు వెళ్లడంతో మెగా అభిమానులు కొంత నిరాశకు గురవుతున్నారు. అయితే, ఈ ఆలస్యానికి తగ్గట్టుగానే అవుట్‌పుట్ అద్భుతంగా వస్తుందని, నిరీక్షణకు తగ్గ ప్రతిఫలం ఉంటుందని చిత్ర బృందం హామీ ఇస్తోంది.

సినిమాకు సంబంధించి ఒక స్పెషల్ సాంగ్ మినహా మిగతా షూటింగ్ అంతా పూర్తయినట్లు సమాచారం. త్వరలోనే ఈ పాట చిత్రీకరణను కూడా ముగించి, పోస్ట్ ప్రొడక్షన్ పనులపై దృష్టి సారించనున్నారు. రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

సాంకేతిక నిపుణులు: ఆస్కార్ విజేత ఎ.ఆర్. రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -