- Advertisement -

టీజర్‌తో అంచనాలు పెంచేసిన ధనుష్!

- Advertisement -

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన తాజా చిత్రం ‘కర’ (Kara). ‘పోర్ తొళిల్’ వంటి సూపర్ హిట్ థ్రిల్లర్‌ను అందించిన విఘ్నేశ్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు టీజర్ తాజాగా విడుదలై, ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

పంటో.. గడ్డో.. పాపమో.. పుణ్యమో.. తను నాటింది తనే నరుక్కోవాలి. నేను నాటిన విత్తనం ఇప్పుడు కోతకు వచ్చింది. అంతకంటే ముందు నా మీద పడ్డ మచ్చని తుడిచేయాలి. నన్ను నమ్ముకున్న వారిని ముందుకు తీసుకెళ్లాలి. నా పేరు కరసామి” అని ధనుష్ చెప్పే డైలాగ్స్ సినిమాలో ఆయన పాత్ర ఎంత శక్తివంతంగా ఉండబోతోందో వివరిస్తున్నాయి. ఇందులో ధనుష్ ‘కరసామి’ అనే డిఫరెంట్ లుక్ ఉన్న పాత్రలో కనిపిస్తున్నారు. ఆయనపై పడ్డ మచ్చ ఏమిటి? ఆయన ఎవరి కోసం పోరాడుతున్నారు? అనే ప్రశ్నలను ఈ టీజర్ రేకెత్తించింది.

ధనుష్ సరసన ‘ప్రేమలు’ ఫేమ్ మమితా బైజు కథానాయికగా నటించింది. సీనియర్ నటులు జయరామ్, సూరజ్ వెంజరమూడు, కేఎస్ రవికుమార్ కీలక పాత్రలు పోషించారు. ఇది 1990ల కాలంలో జరిగే పీరియడ్ క్రైమ్ థ్రిల్లర్ అని సమాచారం. జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన నేపథ్య సంగీతం టీజర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. విజువల్స్ చాలా సహజంగా, గ్రిట్టిగా ఉన్నాయి. ఈ చిత్రం ఏప్రిల్ 30, 2026న తెలుగు మరియు తమిళ భాషల్లో గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -