- Advertisement -

పెళ్లి వేడుకలో డాన్స్ చేస్తూ నవ వధువు మృతి!

- Advertisement -

శుభకార్యాల్లో బాజాభజంత్రీలు, సందడి ఉండాల్సింది పోయి.. ఆ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. పెళ్లి వేడుకలో ఉత్సాహంగా డాన్స్ చేస్తూ అందరినీ అలరించిన ఒక నవ వధువు, క్షణాల్లో ప్రాణాలు కోల్పోయిన ఘటన రాజస్థాన్‌లో కలకలం రేపింది.

రాజస్థాన్‌లోని జలోర్ జిల్లా బాగోడా ప్రాంతంలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. దీపిక (22) అనే యువతికి కేవలం నాలుగు నెలల క్రితమే వివాహమైంది. ఈ క్రమంలో తమ కుటుంబంలో జరుగుతున్న ఒక పెళ్లి వేడుకకు ఆమె హాజరయ్యారు. వేడుకలో భాగంగా బంధువులతో కలిసి ఎంతో ఉత్సాహంగా డాన్స్ చేస్తున్న సమయంలో ఈ అనూహ్య ఘటన జరిగింది.

మ్యూజిక్ కు అనుగుణంగా స్టెప్పులు వేస్తున్న దీపిక, డాన్స్ చేస్తూనే ఒక్కసారిగా కింద పడిపోయింది. హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఆమె మరణానికి కారణం గుండెపోటు (Heart Attack) అని వైద్యులు ప్రాథమికంగా ధ్రువీకరించారు.దీపిక డాన్స్ చేస్తున్న దృశ్యాలను అక్కడున్న వారు కెమెరాల్లో బంధించారు. ఆమె ఎంతో సంతోషంగా డాన్స్ చేస్తూ, మరుక్షణమే ప్రాణాలు వదలడం చూసి నెటిజన్లు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు.

చూస్తుండగానే నిండు ప్రాణం గాలిలో కలిసిపోవడం అత్యంత బాధాకరం. యువతలో పెరుగుతున్న ఈ హఠాన్మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి అని సోషల్ మీడియాలో ఒక నెటిజన్ ఆవేదన వ్యక్తం చేశారు.ఇటీవలి కాలంలో చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించే వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా జిమ్ చేస్తున్నప్పుడు, డాన్స్ చేస్తున్నప్పుడు లేదా శారీరక శ్రమ చేస్తున్నప్పుడు ఇలాంటి ఘటనలు జరగడం కలవరపెడుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -