- Advertisement -

ఓటీటీలోకి రానా ‘నీలిరా’!

- Advertisement -

తమిళ సినీ పరిశ్రమలో విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రం నీలిరా. తాజాగా ఓటీటీ డేట్ లాక్ అయింది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ కానుంది నీలిరా. దర్శకుడు సోమితరణ్ తెరకెక్కించిన ఈ సినిమా 1988 శ్రీలంక అంతర్యుద్ధం నేపథ్యంలో సాగుతుంది. యుద్ధ ప్రభావం సాధారణ ప్రజల జీవితాలను ఎలా ఛిన్నాభిన్నం చేసిందనే అంశాన్ని భావోద్వేగంగా చూపించారు. ఒక కుటుంబం చుట్టూ తిరిగే కథలో భయం, బతుకుబండి, మానవ సంబంధాల భావోద్వేగాలను సహజంగా ఆవిష్కరించిన తీరు ప్రేక్షకులను కదిలించింది.

ఈ చిత్రంలో నవీన్ చంద్ర, సనత్, రూపా కొడువ్యార్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ముఖ్యంగా నవీన్ చంద్ర నటనకు మంచి ప్రశంసలు లభించాయి. భావోద్వేగ సన్నివేశాలు, యుద్ధ వాతావరణాన్ని సహజంగా చూపించిన తీరు సినిమాకు ప్రత్యేక బలంగా నిలిచిందని సినీ విమర్శకులు అభిప్రాయపడ్డారు.

“నీలిరా” చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజుతో కలిసి రానా దగ్గుబాటి నిర్మాణ పరంగా మద్దతు ఇచ్చారు. చిన్న సినిమాగా వచ్చినప్పటికీ కంటెంట్ బలంతో ఈ మూవీ మంచి గుర్తింపు తెచ్చుకుంది. థియేటర్లలో పెద్దగా వసూళ్లు సాధించకపోయినా, మౌత్ టాక్‌తో సినిమా గురించి చర్చ పెరిగింది.

యుద్ధ నేపథ్య కథలు, భావోద్వేగ డ్రామాలను ఇష్టపడే ప్రేక్షకులకు నీలిరా ప్రత్యేక అనుభూతిని అందిస్తుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఈ చిత్రాన్ని జీ5లో వీక్షించవచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -