టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న పీరియడ్ యాక్షన్ డ్రామా రణబలిపై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. తాజాగా చిత్రబృందం విడుదల చేసిన ప్రత్యేక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో విజయ్ దేవరకొండ గుర్రపు స్వారీ శిక్షణ తీసుకుంటూ కనిపించగా, “ఫీనిక్స్‌లా మళ్లీ లేచే యోధుడు” అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
వీడియోలో విజయ్ గంటల తరబడి గుర్రపు స్వారీ ప్రాక్టీస్ చేస్తూ, యాక్షన్ సన్నివేశాల కోసం తీవ్రంగా శ్రమిస్తున్నట్లు కనిపించారు. వేగంగా పరిగెత్తే గుర్రంపై సమతుల్యం పాటిస్తూ యాక్షన్ మూవ్మెంట్స్ చేయడం అభిమానులను ఆకట్టుకుంది. ఈ పాత్ర కోసం విజయ్ ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి.
దర్శకుడు రాహుల్ సంకీర్తన్ తెరకెక్కిస్తున్న “రణబాలి” బ్రిటిష్ పాలన కాలంలో జరిగిన చారిత్రాత్మక సంఘటనల ఆధారంగా రూపొందుతోంది. 1854 నుంచి 1878 మధ్య జరిగిన ఓ చీకటి అధ్యాయాన్ని ఈ సినిమా చూపించబోతున్నట్లు ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌లో సూచించారు. ఇందులో విజయ్ ఓ తిరుగుబాటు యోధుడి పాత్రలో కనిపించనున్నారు.
ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తుండగా, విజయ్–రష్మిక కాంబినేషన్‌పై అభిమానుల్లో ఇప్పటికే భారీ ఆసక్తి నెలకొంది. “గీత గోవిందం”, “డియర్ కామ్రేడ్” తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న సినిమా కావడంతో హైప్ మరింత పెరిగింది.
ఇప్పటికే రణబాలి సెట్స్ నుంచి లీకైన కొన్ని గుర్రపు స్వారీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విజయ్ రౌద్రరూపంలో గుర్రంపై దూసుకెళ్తున్న సన్నివేశాలు అభిమానుల్లో ఉత్సాహం నింపాయి. ఈ సినిమా కోసం ఆయన పూర్తి మేకోవర్‌తో కనిపించనున్నట్లు తెలుస్తోంది. రణబాలి ను 2026 సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.
