నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న #NBK112 చిత్రం గురించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో బాలకృష్ణ నటించబోయే ఈ చిత్రానికి ‘కార్పెంటర్’ (Carpenter) అనే వెరైటీ టైటిల్ను ఖరారు చేసినట్లు సమాచారం.
సాధారణంగా పవర్ఫుల్ పేర్లతో వచ్చే బాలయ్య సినిమాలకు భిన్నంగా, కొరటాల శివ ఈసారి ‘కార్పెంటర్’ అనే క్లాస్ మరియు మాస్ టచ్ ఉన్న టైటిల్ను ఎంచుకోవడం విశేషం. ఈ టైటిల్ను మేకర్స్ ఇప్పటికే రిజిస్టర్ చేయించినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాకు మరో అతిపెద్ద ఆకర్షణ అనిరుధ్ రవిచందర్. ప్రస్తుతం సౌత్ ఇండియాలోనే టాప్ ఫామ్లో ఉన్న అనిరుధ్, బాలయ్య సినిమాకు సంగీతం అందించడం ఇదే తొలిసారి. బాలయ్య మాస్ ఎనర్జీకి అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తోడైతే థియేటర్లు దద్దరిల్లడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం (పూజా కార్యక్రమం) మే 21న నిర్వహించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం బాలకృష్ణ NBK111 (గోపీచంద్ మలినేని దర్శకత్వంలో) షూటింగ్లో బిజీగా ఉండగా, అది పూర్తయిన వెంటనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది.
