- Advertisement -

రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ‘ఎల్లమ్మ’లో ‘ప్రేమలు’ బ్యూటీ?

- Advertisement -

టాలీవుడ్ సంగీత ప్రపంచాన్ని తన ట్యూన్లతో ఏలుతున్న రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ (DSP) హీరోగా పరిచయం కాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఎల్లమ్మ’ (Ellamma). ‘బలగం’ వంటి నేటివిటీ ఉన్న సినిమాతో ఇండస్ట్రీని కదిలించిన వేణు యెల్దండి దర్శకత్వంలో.. అగ్ర నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ విలేజ్ డివోషనల్ డ్రామాను నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నారనే ప్రకటనతోనే ఈ ప్రాజెక్టుపై తెలుగు చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతుండగా.. చిత్ర యూనిట్ ఇప్పుడు హీరోయిన్ వేటలో నిమగ్నమైంది. ఇందులో భాగంగా ఒక క్రేజీ అప్‌డేట్ ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ సరసన నటించే కథానాయిక పాత్ర కోసం చిత్ర దర్శకుడు వేణు ఒక పవర్‌ఫుల్ ఫేస్‌ను రంగంలోకి దించాలని భావిస్తున్నారు. మొదట్లో ఈ పాత్ర కోసం టాలెంటెడ్ బ్యూటీస్ సాయి పల్లవి.. మృణాల్ ఠాకూర్ వంటి స్టార్ హీరోయిన్ల పేర్లను పరిశీలించినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కథా పరంగా హీరోయిన్ క్యారెక్టర్‌కు చాలా ప్రాధాన్యత ఉండటంతో నటనకు ప్రాధాన్యం ఉన్న భామల కోసం అన్వేషించారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. ‘ప్రేమలు’ (Premalu) సినిమాతో సౌత్ ఇండియా వ్యాప్తంగా యువత గుండెల్లో అలజడి సృష్టించిన మలయాళ ముద్దుగుమ్మ మమితా బైజు (Mamitha Baiju) పేరును ప్రస్తుతం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

మమితా బైజు ‘ప్రేమలు’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా చాలా దగ్గరైంది. ఆమెకున్న క్రేజ్.. యూత్ అప్పీల్ ఈ విలేజ్ సబ్జెక్టుకు బాగా ప్లస్ అవుతుందని చిత్ర బృందం భావిస్తున్నట్లు టాక్. హీరోయిన్ పాత్రకు సంబంధించి ఇప్పటికే మమితాతో సంప్రదింపులు జరిగాయని.. కథ విన్న ఆమె కూడా ఈ ప్రాజెక్టు పట్ల సానుకూలంగా స్పందించిందని వినికిడి.

ఈ సాలిడ్ విలేజ్ డ్రామాలో దేవిశ్రీ ప్రసాద్ కేవలం హీరోగా నటించడమే కాకుండా.. సినిమాకు తనే స్వయంగా సంగీతాన్ని కూడా సమకూరుస్తున్నారు. తన తండ్రి సత్యమూర్తి గారి పుట్టిన ఊరైన ‘వెదురుపాక’ గ్రామ సంస్కృతీ సాంప్రదాయాల నేపథ్యంలో ఈ కథ సాగనుండటంతో డీఎస్పీ ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. ఈ సినిమాను త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌కు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. హీరోయిన్ ఎవరనేది ఖరారు కాగానే మిగతా నటీనటుల వివరాలతో కూడిన అధికారిక ప్రకటన వెలువడనుంది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -