మారుతున్న కాలంతో పాటు మానవ సంబంధాలు.. ముఖ్యంగా భార్యాభర్తల బంధాలు ఎటు వైపు వెళ్తున్నాయనే అంశంపై సమాజంలో ఇప్పుడు ఒక సరికొత్త చర్చ నడుస్తోంది. వెస్ట్రన్ కల్చర్‌ను గుడ్డిగా ఫాలో అవుతూ.. ఇండస్ట్రీలోనూ, కార్పొరేట్ సర్కిల్స్‌లోనూ సరికొత్త ట్రెండ్స్ పేరుతో బంధాలను విశృంఖలత్వం వైపు తీసుకెళ్తున్నారనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇందులో భాగంగానే తాజాగా వెలుగులోకి వచ్చిన వింత ధోరణి.. Work Husband – Work Wife.
సాధారణంగా ఇంట్లో ఒక హస్బెండ్ లేదా ఒక వైఫ్ ఉంటారు. వారికి ఒకరో ఇద్దరో పిల్లలు కూడా ఉండి.. సంసారం సాగుతూనే ఉంటుంది. కానీ, ఈ సరికొత్త ట్రెండ్ ప్రకారం.. వర్క్ ప్లేస్ (ఆఫీస్) లో ఒక హస్బెండ్, ఒక వైఫ్ ఉంటారట! అంటే, ఆఫీస్ వాతావరణంలో అంత సమయం కలిసి గడుపుతూ.. ఒకరికొకరు జీవిత భాగస్వాముల్లా కేరింగ్ చూపించుకోవడం, ఆఫీస్ అవసరాల కోసం పర్సనల్ బాండ్స్ క్రియేట్ చేసుకోవడం. వెస్ట్రన్ కంట్రీస్‌లో వాళ్లేమో ఇప్పుడు సింగిల్ హస్బెండ్, సింగిల్ వైఫ్ కల్చర్‌కు సెట్ అవుతుంటే.. మన దేశంలో మాత్రం ఆ ఫారెన్ కల్చర్ పేరుతో ఈ సరికొత్త విపరీత ధోరణి వెర్రి వెయ్యి తలలు వేస్తోందనే విమర్శలు వస్తున్నాయి. ఇలాగే వదిలేస్తే.. కొన్ని రోజులకు సమాజంలో “నువ్వు ఇంకా ఫస్ట్ హస్బెండ్తోనే ఉన్నావా? లేదా ఇంకా ఫస్ట్ వైఫ్తోనే ఉన్నావా?” అని అడిగే ఆశ్చర్యకరమైన రోజులు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
గతంలో మన తాత ముత్తాతలు, ఫోర్ ఫాదర్స్ కాలంలో జాయింట్ ఫ్యామిలీస్ (ఉమ్మడి కుటుంబాలు) ఉండేవి. అప్పట్లో భార్యాభర్తల మధ్య ఏవైనా గొడవలు వస్తే.. తాతలు, తల్లిదండ్రులు లాంటి పెద్దవాళ్లు కూర్చోబెట్టి చెప్పేవారు. ఒకసారి పెళ్లయిందంటే అది ‘ఫరెవర్’ (శాశ్వతం) అనే నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు అత్తమామలు, అన్నదమ్ములు ఎవరు వద్దంటూ.. సింగిల్ చైల్డ్ పాలసీతో చిన్న కుటుంబాలుగా మారిపోతున్నారు. ఒకప్పుడు భార్య.. భర్తపై ఫైనాన్షియల్ గా (ఆర్థికంగా) వంద శాతం డిపెండ్ అయ్యేది. భర్త రూపాయి తెచ్చినా, ఎంత తెచ్చినా అందులోనే అడ్జస్ట్ అయ్యి సంసారాన్ని లాక్కొచ్చేవారు.
కానీ ఇప్పుడు అమ్మాయిలు బాగా చదువుకుంటున్నారు, ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ అవుతున్నారు. మంచి హై-ఫై జాబ్స్ చేస్తూ.. లగ్జరీ లైఫ్ బతుకుతున్నారు. దీంతో “ఆమె సంపాదిస్తే నేను సంపాదిస్తున్నా.. ఆయన సంపాదిస్తే నేను సంపాదిస్తున్నా.. నాకెందుకు కాంప్రమైజ్?” అనే ఇగోలు పెరిగిపోతున్నాయి. ఇద్దరి మధ్య కంపాటిబిలిటీ (మైండ్ సెట్ మ్యాచింగ్) ఉంటేనే బంధం సాగుతోంది.. లేదంటే పెళ్లి అనేది ఒక ‘చైనా వస్తువు’లా మారిపోతోంది. అంటే.. నచ్చితే ఉంచుకోవడం, లేదంటే విసిరేయడం అనే ధోరణి వచ్చేసింది.
ఇప్పుడు సమాజంలో భార్యాభర్తల మధ్య గొడవలు రాగానే.. “నువ్వు నా కండిషన్స్ కి ఒప్పుకుంటావా.. లేకపోతే కేసులు వేయాలా?” అనే స్థాయికి కండిషన్స్ వెళ్తున్నాయి. చాలా మందిలో ఇప్పుడు ఎలాంటి అవేర్నెస్ (అవగాహన) వస్తోందంటే.. రోజురోజుకూ ఇంట్లో నరకం అనుభవిస్తూ, మానసిక ఒత్తిడితో ఒకరినొకరు భరించడం కన్నా.. చట్టపరంగా డివోర్స్ (విడాకులు) తీసుకుని, వచ్చే అల్మనీ (Alimony) లేదా మెయింటెనెన్స్ తీసుకుని హ్యాపీగా విడిపోవడం బెటర్ కదా అని ఆలోచిస్తున్నారు. ఒకరినొకరు శాసించుకోవాలనే సొసైటీల్ ఛాలెంజెస్ వల్లే ఈ రోజుల్లో విడాకుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది.
